Wednesday, December 30, 2015

Group-II Notification | నిరుద్యోగులకు కొత్త సంవత్సర కానుక , గ్రూప్-2 నోటిఫికేషన్........



-అత్యధికంగా 220 ప్రొహిబిషన్ అండ్
-ఎక్సైజ్ ఎస్‌ఐ పోస్టులు తర్వాతి స్థానంలో
-110 ఏసీటీవో పోస్టుల భర్తీ
-311 వ్యవసాయ విస్తరణాధికారుల
-పోస్టులు సహా 357 ఖాళీల భర్తీకి మరో మూడు నోటిఫికేషన్లు
-నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
-నేడు మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుక అందజేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. గ్రూప్-2 కేటగిరి పరిధిలోకి వచ్చే 439 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2తో పాటుగా మరో మూడు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ నాలుగు నోటిఫికేషన్లద్వారా మొత్తం 796 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గురువారంనుంచి ఫిబ్రవరి 9వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రూప్-2 పోస్టులకు ఏప్రిల్ 24, 25 తేదీల్లో రాతపరీక్ష నిర్వహిస్తారు. www.tspsc.gov.in వెబ్ సైట్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్- 2లో అత్యధికంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్‌ఐ పోస్టులు 220 ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో 110 అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో) పోస్టులు ఉన్నాయి.

వీటితోపాటుగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3లో 19 పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2లో 23, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈవో పోస్టులు 67 భర్తీ చేయనున్నారు. వ్యవసాయ శాఖలోని వ్యవసాయ విస్తరణాధికారులు గ్రేడ్-2 పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 311 పోస్టులకుగాను జనవరి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పరీక్షను మార్చిలో నిర్వహిస్తారు. పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డులో 44 టెక్నికల్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయడానికి కూడా నోటిఫికేషన్ జారీచేశారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జనవరి 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షను కూడా మార్చిలో నిర్వహించనున్నారు. అయితే పరీక్ష తేదీని తరువాత ప్రకటిస్తారు. మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డులోనే రెండు డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు జనవరి 22లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షను ఫిబ్రవరి 21న నిర్వహిస్తారు. వీటితో పాటుగా గురువారం మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లుగా సమాచారం.
నాలుగు పేపర్లు 600 మార్కులు
 
గ్రూప్-2లో రాత పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150చొప్పున మార్కులు ఉంటా యి. ఒక్కో పేపర్ కు రెండున్నర గం టల సమయాన్ని కేటాయించారు. రెండురోజులపాటు పరీక్ష జరుగనుంది. రెండు పేపర్లు ఒక రోజు, మరో రెండు పేపర్లు మరుసటి రోజు ఉంటాయి. రాత పరీక్షలో ఎం పికైన వారికి ఇం టర్యూ విధానం లో 75 మార్కులు ఉంటాయి. ఇప్పటికే విడుదల చేసిన సిలబస్‌ను టీఎస్‌పీఎస్సీ వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ (ఎంసీక్యూ) విధానంలో పరీక్ష ఉంటుం ది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు లక్షల్లో ఉండే అవకాశం ఉందన్న అంచనాలతో జిల్లాల్లోని ముఖ్యమైన కేంద్రాల్లోనూ పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆలోచన జరుగుతున్నది. ఆఫ్‌లైన్ విధానంలో జరిగే పరీక్షకు బయో మెట్రిక్ విధానం హాజరు నమోదు చేయటానికి, అభ్యర్థుల ఫోటోలు పరీక్ష కేంద్రంలో సేకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి పరీక్షల్లో ప్రతిభ కలిగిన వారికి అవకాశాలు దక్కడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు.
 

No comments:

Post a Comment